కలం, వెబ్ డెస్క్ : పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో తారతలా పారిశ్రామిక ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. అక్కడ నిర్మాణంలో ఉన్న భారీ బహుళ అంతస్తుల గోడౌన్ (Kolkata Warehouse Collapse) ఆకస్మాత్తుగా కుప్పకూలింది. ప్రమాద సమయంలో దాదాపు 50 మంది వరకు కూలీలు పనిచేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటికే 8 మంది మరణించగా.. మరో 40 మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకుని ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రమాద (Kolkata Warehouse Collapse) సమాచారం అందిన వెంటనే స్థానిక యంత్రాంగం, విపత్తు నిర్వహణ బృందాలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. శిథిలాలను వేగంగా తొలగించి లోపల ఉన్న కార్మికుల ప్రాణాలను కాపాడటానికి గ్యాస్ కట్లర్లు, క్రేన్లు, అధునాతన మట్టి తవ్వకం యంత్రాలను ఉపయోగిస్తున్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. మంగళవారం కురిసిన భారీ వర్షాల కారణంగా నిర్మాణంలో ఉన్న ఆ కట్టడం బలహీనపడి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏదిఏమైనా ఈ ఘటనతో కోల్‌కతా మహా నగరంలో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది.
Read Also: ఎల్ నినోను ఎదుర్కొందాం.. కరువును జయించే పంటలను పండిద్దాం!
Follow Us On: X(Twitter)

