డ్ర‌గ్స్ వ్య‌తిరేక ఉద్య‌మానికి నాగార్జున‌కు ఆహ్వానం

క‌లం, వెబ్‌డెస్క్‌: కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి (Kishan Reddy) నేడు సినీ న‌టుడు అక్కినేని నాగార్జున‌ను క‌లిశారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించ‌నున్న న‌షా ముక్త్ భార‌త్‌ యాత్ర‌కు మ‌ద్ద‌తు తెల‌పాల‌ని ఆయ‌న‌ను కోరారు. డ్ర‌గ్స్ నిర్మూల‌న కోసం ఈ కార్య‌క్ర‌మం చేప‌డుతున్న‌ట్లు వెల్ల‌డించారు. న‌వంబ‌ర్ 25, 26, 27వ తేదీల్లో మూడు రోజుల పాటు ఈ యాత్ర‌ను హైద‌రాబాద్‌లో నిర్వ‌హించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా యాత్ర‌లో పాల్గొనాల్సిందిగా నాగార్జునను కిష‌న్ రెడ్డి ఆహ్వానించారు. యువ‌త‌ను ఏకం చేస్తూ, ప్ర‌జ‌ల్ని మేలుకొలిపే ఈ కార్య‌క్ర‌మంలో బాధ్య‌త‌తో ప్ర‌తి ఒక్క‌రూ పాల్గొనాల‌ని పిలుపునిచ్చారు. ఈ డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమానికి నాగార్జున‌ పూర్తి మద్దతు ఇస్తున్న‌ట్లు కిష‌న్ రెడ్డికి చెప్పారు. ఈ సంద‌ర్భంగా యాత్రకు సంబంధించిన ప్రత్యేక టీ షర్టులను కిష‌న్ రెడ్డి నాగార్జునకు అందజేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>