పసుపు పంటల పరిశీలన.. రైతులకు అవగాహన

కలం, దిలావర్పూర్: దిలావర్పూర్ మండలం కాల్వ గ్రామం (Kalva Village)లో నిర్వహించిన పొలం బడి కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా వ్యవసాయ, ఉద్యానవన అధికారులు, శాస్త్రవేత్తలు రైతులతో కలిసి పసుపు పంట పొలాలను గురువారం పరిశీలించారు. పంటలో వచ్చే వివిధ తెగుళ్లు, పురుగుల నివారణ చర్యలు, పోషక లోపాలను గుర్తించి నివారించే పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. పంట దిగుబడి పెంచేందుకు శాస్త్రీయ పద్ధతులు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ రాహుల్ విశ్వకర్మ, ఉద్యాన అధికారి మౌనిక, ఉప సర్పంచ్ హరికృష్ణ, ఎస్సీ సెల్ జనరల్ సెక్రటరీ బ్యాగరి శ్రీనివాస్, వార్డు సభ్యులు ప్రశాంత్, పాకాల రాజు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>