Mobile Popup Ad
Mobile Popup Ad

‘ఏడాదిలో కాజీపేట రైల్వే మానుఫ్యాక్చరింగ్ యూనిట్ పూర్తి’

కాజీపేట(Kazipet)లో నిర్మిస్తున్న రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏడాదిలో పూర్తవుతుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) తెలిపారు. శనివారం వరంగల్‌లో పర్యటించిన కిషన్.. ఈ యూనిట్ పనులను పరిశీలించారు. కొన్ని నెలల పాటు భారీ వర్షాల కారణంగా మూడు-నాలుగు నెలలు చిన్న ఇబ్బందులు ఎదురైనా, ఇప్పుడు పనులు మళ్ళీ పూర్తి స్థాయిలో వేగవంతంగా ముందుకెళ్తున్నాయని చెప్పారు. మొత్తం 160 ఎకరాలలో ఈ భారీ రైల్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ (RMU) నిర్మాణం జరుగుతోందన్నారు. ‘‘ఈ ప్రాజెక్టు మొదటి దశకు సుమారు రూ.521 కోట్ల వ్యయం కేటాయించాం. షెడ్ నిర్మాణం పూర్తయిన తర్వాత అత్యాధునిక ఎక్విప్మెంట్స్ కూడా ఇక్కడ అమర్చడం జరుగుతుంది’’ అని చెప్పారు. అత్యంత ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి ఈ RMU నిర్మాణం జరుగుతోందని వెల్లడించారు.

ఇక్కడ 75% పనులు పూర్తయ్యాయి. వచ్చే సంవత్సరం పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. ఇక్కడ 16 కోచ్ లతో కూడిన రేక్స్ తయారు చేసే ప్రణాళిక ఉంది. తెలంగాణ రాష్ట్ర నడిబొడ్డున ఇలాంటి రైల్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ రావడం చాలా పెద్ద అవకాశమైందని పేర్కొన్నారు. ఇక్కడి నుంచి దేశమంతా అద్భుతమైన రైలు కనెక్టివిటీ ఉండటం వల్ల ఇక్కడ తయారయ్యే ఉత్పత్తులను దేశంలో ఎక్కడికైనా వేగంగా పంపవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక్కడ గొప్ప రవాణా సదుపాయాలు ఉండడం రైల్వేకు ముఖ్యమైన ఆదాయ వనరు కూడా అవుతుందని వివరించారు. రైల్ వికాస్ నిగం లిమిటెడ్ (RVNL) కు ఈ ప్రాజెక్ట్ బాధ్యతలు అప్పగించామని, అనుకున్న షెడ్యూల్ ప్రకారం పనులు ముందుకు వెళ్తుండటం ఎంతో సంతోషకరమని Kishan Reddy తెలిపారు.

Read Also: ‘దీక్షాదివస్’… ఆశ్చర్యపరుస్తోన్న కవిత తీరు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>