కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ నగరంలోని నాగారం రాజారాం స్టేడియంలో రేపటి నుంచి ఖేలో ఇండియా విలువిద్య (Khelo India Archery) శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని అంతర్జాతీయ విలువిద్య క్రీడాకారుడు, శిక్షకుడు మద్దుల మురళి వెల్లడించారు. ఈ శిక్షణ శిబిరం ప్రతి రోజు ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు ఖేలో ఇండియా ఆర్చరీ (Khelo India Archery) ట్రైనింగ్ సెంటర్‌లో ఉచితంగా నిర్వహించబడుతుంది. వేసవి సెలవులలో విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మురళి సూచించారు.
చదువుతో పాటు క్రీడలు కూడా జీవితంలో ముఖ్యమైన భాగమని, విలువిద్య వంటి క్రీడలు శారీరక దృఢత్వం, ఏకాగ్రత పెంపొందించడంలో ఎంతో ఉపయోగకరమని తెలిపారు. తల్లిదండ్రులు కూడా పిల్లలను క్రీడల వైపు ప్రోత్సహించాలని కోరారు. విలువిద్యలో ఆసక్తి ఉన్న విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా నమోదు చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు మద్దుల మురళిని 9848919480 నంబర్ ద్వారా సంప్రదించవచ్చు.

