కలం, నిర్మల్ : కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం పట్నాపూర్‌లో ఆదివారం నిర్వహించిన శ్రీశ్రీశ్రీ పరమహంస సద్గురు పూలాజీ బాబా 102వ జయంతి మహోత్సవంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ (Vedma Bhojju) పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూలాజీ బాబా సమాధిని దర్శించుకున్న ఆయన అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. బాబా చూపిన ఆధ్యాత్మిక మార్గం, సేవా భావం సమాజానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ జయంతి వేడుకల్లో భక్తులు, స్థానిక నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

