ఒక్కటైన కెనడా అమ్మాయి.. తెలంగాణ అబ్బాయి

కలం, నిజామాబాద్ బ్యూరో : కెనడా అమ్మాయి.. తెలంగాణ అబ్బాయి.. ప్రేమ పెళ్లితో ఒక్కటయ్యారు. నిజామాబాద్ (Nizamabad) పట్టణం ఇందుకు వేదిక అయ్యింది. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన తాటిపాముల సంజయ్ కెనడా అమ్మాయిని పెళ్లాడాడు. కెనడాలో ఉంటున్న సంజయ్ కి సబ్రినా ఏమీస్వైన్ తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది.

దీంతో ఇరు కుటుంబాలను ఒప్పించి ఆదివారం ఇద్దరూ వైభవంగా పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు. ప్రేమకు ప్రాంతం, జాతి, కులం, మతం అడ్డుకాదని నిరూపించారు ఈ నవ దంపతులు.. పెళ్లి పత్రిక కూడా ఇరువురి పేరుతో ముద్రించి బంధు మిత్రులకు అందించారు. ఇరు కుటుంబాల సమక్షంలో బంధువుల ఆనందోత్సాహాల నడుమ ఘనంగా పెళ్లి చేసుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>