బీడీ కార్మికులకు జీవన భృతి ఇవ్వాలి: సీఐటీయూ

కలం, నిర్మల్: పీఎఫ్ ఉన్న బీడీ కార్మికులకు జీవన భృతి కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో మంగళవారం ఖానాపూర్ (Khanapur) పట్టణంలో ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ.. ఆన్లైన్ దరఖాస్తులో బీడీ కార్మికులకు అవకాశం కల్పించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు పింఛన్‌ ను రూ.4,016కు పెంచాలని డిమాండ్ చేశారు.

రిటైర్మెంట్ అనంతరం రూ.6 వేల పింఛన్, నెలకు 26 రోజుల పని కల్పించాలని కోరారు. జిల్లాలో లక్షన్నరకు పైగా బీడీ కార్మికులు ఉండగా, ప్రస్తుతం 61,933 మందికి మాత్రమే పింఛన్ అందుతోందన్నారు. బీడీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. అనంతరం తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీడీ కార్మికులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>