డేవిడ్ రాజు వ్యవహారంపై ఖమ్మం పార్టీ ప్రకటన

​కలం, ఖమ్మం బ్యూరో: వైరా నియోజకవర్గంలో ఎలాంటి పదవుల కేటాయింపు జరపలేదని ఖమ్మం (Khammam) జిల్లా తెలంగాణ రక్షణ సేన స్పష్టం చేసింది. పార్టీతో అనుబంధంగా పనిచేస్తున్న జి. డేవిడ్ రాజు (జగదీశ్)ను పార్టీ నుంచి పూర్తిగా పక్కన పెడుతున్నట్లు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ​డేవిడ్ రాజుపై వచ్చిన వివిధ ఆరోపణలపై పార్టీ అధిష్టానం తీవ్రంగా స్పందించిందని తెలిపింది. ఖమ్మం జిల్లా ప్రజలతో పాటు వైరా నియోజకవర్గ ప్రజలందరికీ ఈ విషయాన్ని తెలియజేస్తున్నామని పేర్కొంది.

ఇకపై పార్టీకి డేవిడ్ రాజుతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ​వైరా నియోజకవర్గ పరిధిలో తెలంగాణ రక్షణ సేన పార్టీ తరఫున ఇప్పటివరకు ఏ ఒక్క నాయకుడికీ అధికారిక పదవిని ఇవ్వలేదని జిల్లా నాయకత్వం పేర్కొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>