చీపుర్లు, వేతనాలు ఇవ్వకపోతే ఎలా?.. ఖమ్మం పారిశుద్ధ్య కార్మికుల ఫైర్

కలం, ఖమ్మం బ్యూరో: “కనీసం చీపుర్లు, వేతనాలు ఇవ్వకపోతే పారిశుద్ధ్య పనులు ఎలా చేయాలి?” అంటూ ఖమ్మం నగరపాలక సంస్థ కార్మికులు (Khammam Sanitation Workers) శుక్రవారం కదంతొక్కారు. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి (ఐకాస) ఆధ్వర్యంలో భారీ ఆందోళన చేపట్టారు. కార్మికులందరూ మూకుమ్మడిగా విధులను బహిష్కరించడంతో నగరంలో పారిశుద్ధ్య పనులు స్తంభించి, ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది.

​ఈ సందర్భంగా ఐకాస నాయకులు విష్ణు, రామయ్యలు మాట్లాడుతూ.. అధికారులు, గుత్తేదారుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కార్మికుల సమస్యల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, గుత్తేదారులు వేతనాలు సరిగా చెల్లించకపోయినా ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అంతేకాకుండా, కార్మికులకు రక్షణ పరికరాలు అందించాలని, చీపుర్లు, ఇతర అవసరమైన వస్తువులు ఇవ్వకపోవడంతో రోజువారీ పారిశుద్ధ్య పనులు చేపట్టడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించకుంటే, ఆందోళనను మరింత ఉద్ధృతం చేసి నిరవధిక సమ్మె చేపడతామని కార్మిక సంఘాల నాయకులు హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>