ఖమ్మంలో వైద్యాధికారుల ఆకస్మిక దాడులు

కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రామారావు (DMHO Ramarao) బిగ్ షాక్ ఇచ్చారు. మంగళవారం స్థానిక అంకుర ఆసుపత్రిపై ఆయన ఆకస్మిక దాడులు నిర్వహించి క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

​ఈ ఆకస్మిక తనిఖీల్లో భాగంగా ఆసుపత్రిలోని రికార్డులతో పాటు లేబొరేటరీ (ల్యాబ్), స్కానింగ్ విభాగాలను డీఎంహెచ్‌‌‌‌ఓ ప్రత్యక్షంగా పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, ల్యాబ్ పరీక్షల ప్రమాణాలు, స్కానింగ్ సేవల వివరాలతో పాటు క్లినికల్ రికార్డులు, రిజిస్టర్లను నిశితంగా తనిఖీ చేశారు. ​ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ డాక్టర్ రామారావు మాట్లాడుతూ.. ఆసుపత్రిలోని ప్రతి విభాగం ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారమే నడవాలని ఆదేశించారు.

రోగులకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, అన్ని రికార్డులను ఎప్పటికప్పుడు పక్కాగా నిర్వహించాలని డీఎంహెచ్‌ఓ సూచించారు. ప్రతి ప్రైవేట్ ఆసుపత్రి క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టాన్ని తప్పనిసరిగా పాటించాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ​ఈ తనిఖీల సమయంలో అంకుర ఆసుపత్రి మేనేజర్ తో పాటు ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>