మృతి చెందిన హోంగార్డ్ కుటుంబానికి పోలీస్ శాఖ అండ

కలం, నారాయణపేట: నారాయణపేట జిల్లా పోలీస్ (Narayanpet Police) శాఖలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తూ ఇటీవల గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందిన బాలకృష్ణ కుటుంబానికి జిల్లా పోలీస్ శాఖ అండగా నిలిచింది. పోలీస్ వెల్ఫేర్ నిధి నుంచి మంజూరైన రూ.15,000 పరిహార చెక్కును సోమవారం ఎస్పీ డాక్టర్ వినీత్ ఎస్పీ కార్యాలయంలో మృతుడి భార్య భవానికి అందజేశారు. కొత్తపల్లి మండలం గోకుల్ నగర్‌కు చెందిన బాలకృష్ణ నారాయణపేట జిల్లా పోలీస్ శాఖలో హోంగార్డుగా విధులు నిర్వహించారు.

ఆయన ఆకస్మిక మరణంతో భార్య భవాని, ముగ్గురు చిన్నారులు కుటుంబ పెద్దను కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… పోలీస్ శాఖలో బాలకృష్ణ అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. విధి నిర్వహణలో భాగంగా పోలీస్ శాఖకు సేవలందించిన సిబ్బంది కుటుంబాలకు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ఆపద సమయంలో వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు పోలీస్ శాఖ ముందుంటుందని భరోసా ఇచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>