మైనర్ మిస్సింగ్ కేసులపై తక్షణమే స్పందించాలి.. ఖమ్మం సీపీ

కలం, ఖమ్మం బ్యూరో: మైనర్ మిస్సింగ్ కేసుల్లో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఖమ్మం పోలీస్ కమిషనర్ (Khammam CP) సునీల్ దత్ హెచ్చరించారు. మంగళవారం ఖమ్మంలో జరిగిన నేర సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేసి, ప్రత్యేక బృందాలతో దర్యాప్తు వేగవంతం చేయాలన్నారు. అవసరమైతే ఇతర రాష్ట్రాల పోలీసులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. ​సురక్షిత సమాజ నిర్మాణంలో ప్రజలు భాగస్వామ్యంతో కాలనీలు, ప్రధాన రహదారుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

జిల్లా వ్యాప్తంగా విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా నిరంతరం వాహన తనిఖీలు చేపట్టాలన్నారు. మాదకద్రవ్యాల సరఫరాపై నిఘా ఉంచాలని తెలిపారు. మహిళల భద్రతకు షీటీమ్స్ ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ​ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ రామానుజం, వివిధ విభాగాల ఏసీపీలు, ఏఓ కళావతి పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>