సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి.. ఖమ్మం సీపీ సునీల్ దత్

కలం, ఖమ్మం బ్యూరో: సైబర్ నేరాల పట్ల అలర్ట్‌గా ఉండి, ఆలోచిస్తే మోసాలకు సులభంగా చెక్ పెట్టవచ్చని ఖమ్మం పోలీస్ కమిషనర్ (Khammam CP) సునీల్ దత్ స్పష్టం చేశారు. జాతీయ సైబర్ సెక్యూరిటీ అవగాహన మాసంలో భాగంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో రూపొందించిన “పాజ్ ఫర్ సేఫ్టీ – థింక్ – వెరిఫై” పోస్టర్లను గురువారం ఖమ్మం సీపీ కార్యాలయంలో ఆవిష్కరించారు.

​ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, ఈ-మెయిల్‌లు, సోషల్ మీడియా లింక్‌లను తొందరపడి నమ్మవద్దని సూచించారు. OTP, PIN, CVV, పాస్‌వర్డ్‌లు, బ్యాంక్ ఖాతా లాంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని హెచ్చరించారు. అనుమానాస్పద సందేశాలు వచ్చినప్పుడు “ఆగండి – ఆలోచించండి – ధృవీకరించండి” అనే సూత్రాన్ని తప్పక పాటించాలని కోరారు. ముఖ్యంగా పార్ట్ టైమ్ ఉద్యోగాలు, ఆన్‌లైన్ పెట్టుబడులు, తక్కువ వడ్డీకే రుణాలు, బహుమతులు, డిజిటల్ అరెస్టులు, KYC అప్‌డేట్ పేర్లతో జరిగే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

​ఒకవేళ ఎవరైనా సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసి లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏసీపీ ఫణిందర్‌తో పాటు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>