కలం, ఖమ్మం బ్యూరో : పోలీసు విధి నిర్వహణలో కఠినంగా ఉంటూనే, కుంచె పట్టి అద్భుతాలు సృష్టిస్తున్నాడు ఖమ్మం (Khammam) జిల్లా తకాని మండలం గాంధీనగర్ కాలనీకి చెందిన దాసరి విక్రమ్. ప్రస్తుతం పోలీస్ శాఖలో కానిస్టేబుల్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విక్రమ్ (Vikram), ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పట్ల ఉన్న గౌరవంతో ఆయన చిత్రాన్ని పెన్సిల్ స్కెచ్ గా మలిచారు. శనివారం కమిషనరేట్లో సీపీ ని మర్యాదపూర్వకంగా కలిసి, చిత్రపటాన్ని కమిషనర్ కి బహుకరించారు. సీపీ సునీల్ దత్ విక్రమ్ అభినందించారు. భవిష్యత్తులో కూడా తన కళ ద్వారా పోలీసు శాఖకు మరింత గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు.
Khammam | కేవలం ఒక చిత్రపటానికే పరిమితం కాకుండా, విక్రమ్ తన కళా ప్రతిభను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అనేక పోలీస్ బెటాలియన్లలో చాటుకున్నారు. వివిధ బెటాలియన్ల గోడలపై, కార్యాలయాల్లో పోలీసుల త్యాగాలు, సాహసాలు, సామాజిక అంశాల గురించి ఆయన వేసిన పెయింటింగ్స్ అద్భుతంగా ఆకట్టుకుంటున్నాయి.


