కలం, వెబ్‌సైట్ : సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్స్‌లో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సమావేశంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు (Ramchander Rao) కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మున్సిపల్ ఎన్నికల నగారా మోగనున్న తరుణంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
నగరాల అభివృద్ధి కోసం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అమృత్, స్వచ్ఛ భారత్ వంటి పథకాల ద్వారా వేల కోట్లు మంజూరు చేస్తోందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను ఇతర అవసరాలకు దారిమళ్లిస్తూ ప్రజలను మోసం చేస్తోందని రాంచందర్ రావు ఆరోపించారు. గత 11 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలోనూ, ఇప్పుడున్న కాంగ్రెస్ పాలనలోనూ తెలంగాణ ప్రజలకు నిరాశే మిగిలిందని చెప్పారు. ఒకవైపు కేంద్రం ములుగు యూనివర్సిటీ వంటివి రాష్ట్రానికి ఇస్తుంటే, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం తన హామీలను విస్మరిస్తోందని విమర్శించారు.
మున్సిపల్ ఎన్నికలే (Municipal Elections) లక్ష్యంగా బీజేపీ శ్రేణులు సమరానికి సిద్ధం కావాలని ఆయన (Ramchander Rao) పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కార్యకర్తలు చూపిన చొరవను, సాధించిన విజయాలను అభినందించారు. అదే పట్టుదలతో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలని కోరారు.
Read Also: లాఠీతో రౌద్రం.. కుంచెతో చిత్రం
Follow Us On: Sharechat


