epaper
Wednesday, February 18, 2026
epaper

ఏంట్రా ఇది.. అడుక్కునే రోబోని తయారు చేసేశారు

కలం, వెబ్​ డెస్క్ : టెక్నాలజీతో ఆటలు ఆడుకోవడం.. వాటిని చిత్రవిచిత్రాలకు ఉపయోగించడం మనం చూసి ఉంటాం. రోబోలను అనేక రంగాలలో ఉపయోగిస్తూ వాటి ద్వారా లాభాలు పొందుతున్నారు. అయితే, కేరళలో ఓ వ్యక్తి రోబోను ఉపయోగించి చేసిన పని (Begging Robot) ఇప్పుడు సోషల్​ మీడియాలో తెగ వైరల్​ అవుతోంది. ఆ వీడియోలో ఓ వ్యక్తి హ్యూమనాయిడ్ రోబో ను కస్టమైజ్ చేయించుకున్నాడు. బిచ్చం ఎత్తుకునేలా దానికి ప్రోగ్రామ్​ చేశాడు. సాధారణ బిచ్చగాళ్లలాగే ఆ రోబో చేతులు చాచి డబ్బుల కోసం అడుగుతుండడం వీడియోలో చూడొచ్చు. దీనిపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం రోబోకు బిచ్చగాడిలా ప్రోగ్రామ్​ ఎథికల్​ సరైందేనా అని ప్రశ్నిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>