epaper
Wednesday, February 18, 2026
epaper

ఎప్​స్టీన్​ను కలిశా.. కేంద్ర మంత్రి హర్దీప్​ సింగ్​ పూరి

కలం, వెబ్​డెస్క్​: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ‘ఎప్​స్టీన్​ సెక్స్​ స్కాండల్​’ కేసులో ప్రధాన నిందితుడైన ఎప్​స్టీన్​ను తాను కలిసినట్లు కేంద్ర మంత్రి హర్దీప్​ సింగ్​ పూరి చెప్పారు (Hardeep Singh Puri). బుధవారం లోక్​సభలో బడ్జెట్​పై చర్చ సందర్భంగా కాంగ్రెస్​ ఎంపీ రాహుల్​ గాంధీ మాట్లాడుతూ ‘ఎప్​స్టీన్​ ఫైల్స్​’ గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఈ ఫైల్స్​లో అదానీ, అనిల్​ అంబానీ, హర్దీప్​ సింగ్​ పూరి పేర్లు ఉన్నట్లు ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.

ఈ క్రమంలో హర్దీప్​ సింగ్​ పూరి స్పందించారు. తాను ఇంటర్నేషనల్​ పీస్​ ఇనిస్టిట్యూట్​(ఐపీఐ) బృందంలో భాగంగా ఎప్​స్టీన్​ను కలిసినట్లు వెల్లడించారు. ‘ఐపీఐలో మా టీమ్​ లీడర్​కు ఎప్​స్టీన్​ తెలుసు. అందువల్ల కొన్ని సార్లు కలవాల్సి వచ్చింది. కచ్చితంగా చెప్పాలంటే మూడు, నాలుగు సార్లు మాత్రమే కలిశా. ఒక్కసారి ఈమెయిల్​ చేసుకున్నాం. అయితే, అతడి సెక్స్​ స్కాండల్​ కుంభకోణానికి మాకు ఎలాంటి సంబంధం లేదు’ అని హర్దీప్​ స్పష్టం చేశారు. అయితే, సభలో రాహుల్​ ఆరోపించినవన్నీ అవాస్తవమన్నారు.

‘లోక్​సభలో ఈరోజు రాహుల్​ కొన్ని విషయాలు మాట్లాడారు. అయితే, అవన్నీ పూర్తి నిరాధారం. మన రాజకీయ వ్యవస్థలో రెండు రకాల నాయకులు ఉంటారు. ఒకరు బాధ్యతగా ప్రవర్తిస్తారు. మరికొందరు అప్పుడప్పుడూ సభకు వస్తూ ఆరోపణలు చేస్తారు. వాటికి సమాధానాలు వినకుండా వాకౌట్​ చేస్తారు’ అంటూ రాహుల్​ను ఉద్దేశించి హర్దీప్ (Hardeep Singh Puri) వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>