కలం, సినిమా : న్యాచురల్ స్టార్ నాని (Nani) హీరోగా, టాలెంటెడ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’(The Paradise) సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్‌ను(Keerthy Suresh) తీసుకున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది. ఇప్పటికే నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన ‘దసరా’ భారీ విజయాన్ని అందుకోవడంతో ‘ది ప్యారడైజ్’ పై భారీ హైప్ నెలకొంది.
ఈ సినిమాలో నాని మునుపెన్నడూ చూడని మాస్ అవతార్‌లో కనిపిస్తున్నాడు. యాక్షన్, ఎమోషన్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం భారీ స్థాయిలో రూపొందుతోంది. గతంలో నేను లోకల్, దసరా వంటి చిత్రాలలో నాని సరసన హీరోయిన్‌గా నటించిన కీర్తి సురేష్.. ప్యారడైజ్ కోసం స్పెషల్ సాంగ్ చేస్తుండటం సినిమాకు మరింత క్రేజ్ తీసుకురానుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కయాదు లోహార్ హీరోయిన్‌గా నటిస్తుండగా యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. త్వరలోనే మేకర్స్ ఈ సినిమా అఫీషియల్ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.

