కలం, వెబ్ డెస్క్ : నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) ఆరోగ్య పరిస్థితిపై సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి వైద్యులు కాసేపటి క్రితం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ప్రస్తుతం పెద్ధి సుదర్శన్ రెడ్డి శ్వాసక్రియ వ్యవస్థ బాగానే ఉన్నా మెదడుకు ఆక్సిజన్ అందడం లేదని వైద్యులు తెలిపారు.
గుండెపోటు వచ్చిన సమయంలో మెదడుకు సరిపడా ఆక్సిజన్ అందకపోవడంతో మెదడు తీవ్రంగా దెబ్బతిన్నట్లు వైద్యులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయనకి వెంటిలేటర్ సహాయంతో చికిత్స అందిస్తున్నామని.. ఇప్పటివరకు ఆయన ఇంకా ఎలాంటి స్పందన ఇవ్వడం లేదని చెప్పారు. అంతర్జాతీయ మార్గదర్శకాల ప్రకారం.. 72 గంటల న్యూరోలాజికల్ రీ-అసెస్మెంట్ నిర్వహించిన తర్వాతే ఆయన ఆరోగ్య స్థితిపై స్పష్టత వస్తుందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

