epaper
Sunday, February 1, 2026
spot_img
epaper

మున్సి‘పోల్స్‌’పై కేసీఆర్ కీలక సూచనలు.. బీఆర్ఎస్‌లో చేరికలపై కామెంట్స్

కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR)  సిట్ విచారణ దాదాపు నాలుగన్నర గంటలపాటు ముగిసింది. విచారణ అనంతరం కేసీఆర్ నివాసానికి బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకున్నారు. సిట్ విచారణను నిరసిస్తూ నల్ల జెండాలను ప్రదర్శించారు. కేసీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు భారీగా నందినగర్ చేరుకోవడంతో కేసీఆర్ కార్యకర్తలు, అభిమానులకు అభివాదం చేశారు. అనంతరం నంది నగర్ నివాసం నుండి ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కు బయలుదేరారు.

అంతకుముందు కేసీఆర్ బీఆర్ఎస్ (BRS) ముఖ్యనేతలు, న్యాయవాదులతో సమావేశమయ్యారు. సిట్ విచారణ తీరుపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నేతలకు కీలక సూచనలు చేశారు. గ్రౌండ్ లెవల్ లో పార్టీ బలంగా ఉందని, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కష్టపడాలని సూచించారు. రెబల్స్ లేకుండా చూసుకోవాలన్నారు. త్వరలో బీఆర్ఎస్‌లోకి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని కేసీఆర్ వెల్లడించినట్టు తెలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>