రాష్ట్రంలో ఘోరం.. 80 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం

కలం, వెబ్ డెస్క్: ఏపీలో సోమవారం అమానుష ఘటన వెలుగుచూసింది. 80 ఏళ్ల వృద్ధురాలు నిద్రిస్తుండగా దాడి చేసి ఓ దుర్మార్గుడు అత్యాచారం చేశాడు. తిరుపతి (Tirupati) జిల్లాలోని తాతయ్యగుంట సమీపంలో ఉన్న మల్లంగుంటలో ఈ దారుణం జరిగింది. వృద్ధురాలు తన ఇంట్లో నిద్రిస్తుండగా ఎవరూ లేని సమయాన్ని చూసి ఓ దుండగుడు ఇంట్లోకి చొరబడ్డాడు. ఆమెను కొట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు. సదరు వృద్ధిరాలిని కొట్టి అక్కడి నుంచి దుండగుడు పరార్ అయ్యాడు.

ఓ భవనంలోని మొదటి అంతస్తులో ఉన్న కుటుంబ సభ్యులు కొన్ని గంటల తర్వాత వచ్చి చూసి షాక్ అయ్యారు. వృద్ధురాలికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆ వెంటనే పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించి నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ పైశాశిక ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Read Also: నల్గొండ జిల్లాలో ‘డెవిల్’ ఫిష్ కలకలం.. మత్స్యకారులు ఆందోళన!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>