Mobile Popup Ad
Mobile Popup Ad

కేసీఆర్ కీలక నిర్ణయం.. కేటీఆర్‌కు మరో బాధ్యత

కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే అన్ని స్థాయిల్లో కొత్త కమిటీలను నియమించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే, ఏర్పాటైన కొత్త కమిటీలకు తప్పనిసరిగా శిక్షణా తరగతులు నిర్వహించాలని సూచించారు. ఈ బాధ్యతలను వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అప్పగిస్తున్నట్లు స్పష్టం చేశారు.

2 గంటలుగా కొనసాగుతున్న సమావేశం..

తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన కొనసాగుతున్న పార్టీ రజతోత్సవ సంబరాల ముగింపు సమావేశం రెండు గంటలుగా కొనసాగుతోంది. కాంగ్రెస్ పాలనా వైఫల్యాలను ఎత్తిచూపుతూ కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసిసనట్లు తెలుస్తోంది. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు, పార్టీ బలోపేతం, తాజా రాజకీయ పరిణామాలపై కూలంకషంగా చర్చిస్తున్నారు. ఇటీవలే పార్టీలో చేరిన జీవన్ రెడ్డిని పార్టీ జనరల్ సెక్రటరీగా అందరికీ పరిచయం చేస్తూ.. ఆయన చేరిక పార్టీకి మరింత బలాన్ని ఇస్తోందని అభినందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>