Mobile Popup Ad
Mobile Popup Ad

అక్రమ దత్తత చట్టరీత్యా నేరం: కలెక్టర్ చంద్రశేఖర్

కలం, నల్లగొండ: అక్రమ దత్తత చట్టరీత్యా నేరమని, అక్రమ దత్తత (Illegal adoption) తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ (Collector Chandrasekhar) అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈనెల 27 నుండి మే 2 వరకు బాలల భద్రత, రక్షణ, మత్తు పదార్థాలకు “నోచెప్పండి” అనే అంశంపై వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. సోమవారం మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చట్టబద్ధమైన దత్తతపై అవగాహన కల్పించేందుకు  జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక హెల్ప్ డెస్క్‌ను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఎవరైనా పిల్లలను దత్తత తీసుకోవలసి వస్తే తప్పనిసరిగా చట్టబద్ధంగా మాత్రమే దత్తత తీసుకోవాలని కలెక్టర్ చెప్పారు.
అక్రమ దత్తత చట్టరీత్యా నేరమని, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దత్తత తీసుకోవాలనుకునే వారు మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులను సంప్రదించి చట్టపరమైన విధానాలను అనుసరించాలని తెలిపారు. మరింత సమాచారం కోసం జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం లేదా జిల్లా బాలల పరిరక్షణ విభాగం (బాలరక్ష భవన్, ఆర్టీసీ బస్టాండ్ వెనుక వీధి, నల్లగొండ)ను సంప్రదించాలని కోరారు. జిల్లాలో దత్తతపై అవగాహన పెంచేందుకు కలెక్టరేట్‌తో పాటు, బస్టాండ్, రైల్వే స్టేషన్లలో సహాయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే మిర్యాలగూడ, దేవరకొండ, హాలియా, నకిరేకల్, చిట్యాల, నాగార్జునసాగర్, చండూరు వంటి పట్టణాల్లో జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. గ్రామస్థాయిలో గ్రామ బాలల పరిరక్షణ కమిటీల ఆధ్వర్యంలో గ్రామపంచాయతీలలో దత్తతపై ప్రజలకు వివరించాలని కలెక్టర్ (Collector Chandrasekhar) తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్   వై. అశోక్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, జిల్లా పరిషత్ సీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, జిల్లా బాలల పరిరక్షణ అధికారి కె. గణేష్, జిల్లా కో-ఆర్డినేటర్ (చైల్డ్ లైన్) బి. మహేశ్, చారుమతి చైల్డ్ కేర్ సంస్థ నిర్వాహకులు నాగసేనారెడ్డి, జిల్లా బాలల పరిరక్షణ సిబ్బంది, చైల్డ్ లైన్ సిబ్బంది, బాలసదనం, శిశుగృహ సిబ్బంది పాల్గొన్నారు.
Follow Us On: WhatsApp
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>