నా పదవీకాలాన్ని పొడిగించండి.. అజిత్ అగార్కర్ రిక్వెస్ట్

కలం, వెబ్ డెస్క్ : భారత క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కార్ (Ajit Agarkar) పదవీకాలం గడువు ఈ ఏడాది జూన్ తో ముగియనుంది. దీంతో అజిత్‌ అగార్కర్ తన పదవీకాలాన్ని పొడిగించమని బీసీసీఐని (BCCI) కోరినట్లుగా ప్రచారం జరుగుతోంది. టీమిండియా టీ20 వరల్డ్‌ కప్‌ 2026 గెలిచిన వెంటనే అగార్కర్‌ ఈ మేరకు బీసీసీఐని రిక్వెస్ట్ చేసినట్లు సమాచారం అందుతోంది. 2027 వన్డే వరల్డ్ కప్ (ODI World Cup 2027) కోసం సన్నాహాలు చేస్తున్నట్లు అజిత్ అగర్కార్ తెలిపినట్లు వినికిడి. 2027 వన్డే వరల్డ్ కప్ వరకు తన పదవీకాలం పొడిగించాలని విన్నవించారట. అయితే ఈ అభ్యర్థనపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

కాగా, అజిత్ అగర్కార్ 2023 నుంచి భారత చీఫ్‌సెలక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు.2025లోనే ఆయన పదవీకాలం ముగియగా.. బీసీసీఐ నుంచి మరో ఏడాది పొడిగింపు లభించింది. అగార్కర్ టీమిండియా నాలుగు ఐసీసీ (ICC) ఈవెంట్లలో ఫైనల్స్‌ ఆడితే, వాటిలో మూడింట్లో విజేతగా నిలిచింది.టీ20 వరల్డ్‌ కప్‌ 2024, ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025, టీ20 వరల్డ్‌ కప్‌ 2026లో భారత జట్టు విజేతగా నిలిచింది. 2023 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ పైన‌ల్ లో టీమిండియా ఓడిపోయింది. అయినప్పటికీ 2023 వన్డే ప్రపంచకప్ ఈవెంట్ లో టీమిండియా వ‌రుస‌గా ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోకుండా ఫైన‌ల్‌కు చేరుకుంది. దీంతో ఈ సారి తన హయాంలో టీమిండియా వన్డే వరల్డ్ కప్ సాధించాలని అజిత్ అగర్కార్ (Ajit Agarkar) భావిస్తున్నారు.ఇందులో భాగంగానే బీసీసీఐకు రిక్వెస్ట్ చేశారని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే.. అజిత్ అభ్యర్థనపై బీసీసీఐ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Read Also: డాడీ, మోడీ, చిన్నమోడీపైనే నా పోరాటం.. కవిత కామెంట్స్

Follow Us On: X(Twitter)

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>