బోనాల ఏర్పాట్లలో ప్రభుత్వం ఫెయిల్: బండి సంజయ్

కలం, వెబ్ డెస్క్: ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల జాతర ఏర్పాట్లలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) విమర్శించారు. భక్తులకు కనీసం సౌకర్యాలు లేవని.. ఎండకు ఎండుతూ వానకు తడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాయకులు వచ్చినవారు వచ్చినట్లు దర్శనం చేసుకుని వెళ్లిపోతున్నారే తప్ప, భక్తుల గురించి పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం హిందూ ఆలయాల మీద వివక్ష చూపుతోందన్నారు.

రంజాన్ పండుగ నిర్వహణ కోసం రూ.33 కోట్లు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. బోనాల పండుగకు కనీసం రూ.20 కోట్లు కూడా ఇవ్వలేదని బండి సంజయ్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఒక్కో ఆలయానికి కనీసం రూ.6 వేలు కూడా రాలేదన్నారు. 80 శాతం ఉన్న హిందువులకు అదే స్థాయిలో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం మాదిరే కాంగ్రెస్ సర్కార్ కూడా బోనాల ఏర్పాట్లపై కనీసం శ్రద్ధ పెట్టలేదని విమర్శించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>