Mobile Popup Ad
Mobile Popup Ad

వికారాబాద్‌లో ఉద్రిక్తత.. భూసేకరణకు వ్యతిరేకంగా కవిత పోరాటం

కలం, వెబ్ డెస్క్: వికారాబాద్ (Vikarabad) ఆర్డీవో కార్యాలయం వద్ద ఇండస్ట్రీయల్ కారిడార్ భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రాపోల్, కాడ్లపూర్ గ్రామాల రైతులు తమ భూములను వదులుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. బలవంతపు భూసేకరణను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ భారీ ధర్నా నిర్వహించారు. ఈ పోరాటానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) మద్దతు తెలిపి రైతులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో విశారదాన్ మహారాజ్‌తో పాటు పలు ప్రజా సంఘాల నేతలు పాల్గొని ప్రభుత్వ తీరును నిరసించారు. రైతుల భూములను లాక్కుంటే ఊరుకోబోమని, వారి హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా కవిత హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>