Mobile Popup Ad
Mobile Popup Ad

కామారెడ్డి జిల్లాలో కవిత రైల్‌రోకో

బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం కవిత(Kavitha) పోరాటబాట పట్టారు. శుక్రవారం ఆమె కామారెడ్డి జిల్లాలో రైల్‌రోకో నిర్వహించారు. కామారెడ్డి(Kamareddy) రైల్వే స్టేషన్ వద్ద రైలు పట్టాలపై కవిత బైఠాయించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు చేరుకున్నారు. బీసీ జనాభా శాతానికి అనుగుణంగా రిజర్వేషన్లు 42 శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం బీసీలను పూర్తిగా విస్మరిస్తోందని కవిత విమర్శించారు. ఎన్నో దశాబ్దాలుగా సామాజిక, రాజకీయంగా వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయాలంటే రిజర్వేషన్ల(Reservations) పెంపు అత్యవసరమని అన్నారు. బీసీలను తెలంగాణ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆమె(Kavitha) ఆరోపించారు.

జాగృతి(Telangana Jagruthi) నాయకులు కూడా మాట్లాడుతూ… బీసీల కోసం ఉద్యమించకపోతే హక్కులు మరింత దూరమవుతాయని వ్యాఖ్యానించారు. రైల్ రోకో కారణంగా రైల్వే రవాణా కొంతసేపు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసు బలగాలు పెద్ద ఎత్తున మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చాయి. నేతలను రైల్వే ట్రాక్‌ల నుంచి తొలగించి స్టేషన్ పరిసరాల్లో నిరసనలు కొనసాగించేందుకు అనుమతించారు. బీసీల(BCs) ఆత్మగౌరవం కోసం, రాజ్యాంగబద్ధమైన హక్కుల కోసం ఈ పోరాటం కొనసాగుతుందన్నారు. రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోవాలని  డిమాండ్ చేశారు.

Read Also: కేసీఆర్ ఇంటికి కవిత సర్‌ప్రైజ్ విజిట్ !

Follow Us On : Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>