Mobile Popup Ad
Mobile Popup Ad

కవితకు క్లీన్ చిట్.. సింగరేణి జాగృతి ఆధ్వర్యంలో సంబురాలు

కలం, వెబ్ డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జాగృతి అధ్యక్షురాలు కవితకు క్లీన్ రావడంతో సింగరేణి జాగృతి (Singareni Jagruthi)  ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సింగరేణి జాగృతి రాష్ట్ర అధ్యక్షుడు హెచ్ఎంఎస్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి వెంకట్ ఆధ్వర్యంలో.. సంబురాలు నిర్వహించారు. ‘న్యాయం గెలిచింది. ధర్మం నిలిచింది’ అని తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పటాకులు పేల్చి స్వీట్స్ పంపిణీ చేసుకున్నారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణకు ఇది ఒక శుభవార్త అని అందరం సంతోషించాలని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాగృతి జిల్లా నాయకులు సునీల్, హెచ్ఎమ్ఎస్ నాయకులు బ్రాంచ్ కార్యదర్శి శ్రీకాంత్, అనిల్ కుమార్, సోషల్ మీడియా ఇంచార్జ్ బబ్లు, సతీష్, శ్యామ్, వేణు శంకర్, అబ్బాస్ సాయి, అంజి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>