Mobile Popup Ad
Mobile Popup Ad

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అరెస్ట్!

కలం, ఖమ్మం బ్యూరో: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఖమ్మం (Khammam) అంబేద్కర్ భవన్‌లో వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాల‌ని డిమాండ్ చేస్తూ క‌విత సోమ‌వారం దీక్ష‌కు దిగిన విష‌యం తెలిసిందే. సోమవారం రాత్రి డీఎస్పీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్‌తో కలిసి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన క‌విత‌ను మంగళవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. కవిత, విశార‌ద‌న్ మ‌హ‌రాజ్‌తో పాటు దీక్ష చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసినా దీక్ష కొనసాగిస్తానని క‌విత‌ స్పష్టం చేశారు. వెలుగుమట్ల (Velugumatla) బాధితులకు న్యాయం జరిగే వరకు దీక్ష కొనసాగిస్తామని వెల్ల‌డించారు. ప్రభుత్వం దిగి వచ్చి కూల్చేసిన చోటునే బాధితులకు ఇంటి స్థలాలు, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>