Mobile Popup Ad
Mobile Popup Ad

కామారెడ్డిలో టెన్ష‌న్ టెన్ష‌న్‌!

క‌లం, వెబ్ డెస్క్‌: కామారెడ్డి (Kamareddy) జిల్లాలో బీజేపీ, కాంగ్రెస్ నేత‌ల ప‌ర‌స్ప‌ర విమ‌ర్శ‌ల‌తో టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది. స‌మితి భూముల విష‌యంలో అధికారులు స్ప‌ష్ట‌త ఇవ్వాల‌ని బీజేపీ ఎమ్మెల్యే కాటిప‌ల్లి వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి (Katipally Venkata Ramana Reddy) డిమాండ్ చేస్తున్నారు. ఈ మేర‌కు ఆయ‌న నేడు ఉద‌యం 11 గంట‌ల‌కు క‌లెక్ట‌రేట్‌కు రానున్నారు. కాంగ్రెస్ నేత‌లు చేస్తున్న ఆరోప‌ణ‌ల‌ను రుజువు చేయాల‌ని కాటిప‌ల్లి స‌వాల్ విసిరారు. కాంగ్రెస్ నాయ‌కులు సైతం ఆధారాల‌తో స‌హా వ‌స్తామ‌ని చెప్ప‌డంతో ఏం జ‌రుగుతుందోన‌ని ఉత్కంఠ నెల‌కొంది. రాష్ట్ర వ్యాప్తంగా ప‌లువురు బీజేపీ ముఖ్య నేత‌లు క‌లెక్ట‌రేట్‌కు రానున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు బ‌హిరంగ చ‌ర్చ‌ల‌కు అనుమ‌తి లేద‌ని పోలీసులు చెప్తున్నారు. ఆందోళ‌న‌ల‌ను దృష్టిలో పెట్టుకొని బీజేపీ నేత‌లను ముంద‌స్తుగా హౌస్ అరెస్ట్ చేసే అవ‌కాశాలు ఉన్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>