కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఐపీఎస్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు బస్టాండ్ వద్ద కార్లలో తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా అద్దాలకు అమర్చిన బ్లాక్ ఫిల్మ్‌లను టింట్ మీటర్ సహాయంతో పరీక్షించి తొలగించారు. రోడ్డు భద్రత, పారదర్శకత దృష్ట్యా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అవగాహన కల్పించారు. అనుమతి లేని బ్లాక్ ఫిల్మ్‌లు అమర్చవద్దని, మరోసారి పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో ట్రాఫిక్ ఏసీపీ యాదగిరిస్వామి, ఇన్స్పెక్టర్లు సంజీవ్, అంజయ్య, ఎస్ఐలు శ్రీకాంత్, హనుమంతరావు పాల్గొన్నారు.

