కలం, కరీంనగర్ బ్యూరో: యువత డ్రగ్స్ వ్యసనాలకు దూరంగా ఉండాలని కరీంనగర్ (Karimnagar) సీపీ గౌష్ ఆలం కోరారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక సందర్భంగా తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో రాష్ట్రవ్యాప్తంగా ‘యాంటీ డ్రగ్ అవేర్నెస్ వీక్’ కార్యక్రమం నిర్వహిస్తోంది. అందులో భాగంగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని దుర్శేడ్ జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీ గౌష్ ఆలం హాజరై విద్యార్థులతో మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు సీపీ తెలిపారు. రూరల్ ఏసీపీ విజయకుమార్, ఇన్‌స్పెక్టర్ నిరంజన్ రెడ్డి, యాంటీ నార్కోటిక్ యూనిట్ ఇన్‌స్పెక్టర్ రఫీక్ ఖాన్, స్థానిక కార్పొరేటర్ రవీందర్, ఎస్సై లక్ష్మారెడ్డి, హెడ్ మాస్టర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

