కరీంనగర్‌లో పోలీసు అధికారుల పదవీ విరమణ సన్మానం

కలం, ​కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ పోలీస్ ( Karimnagar Police) కమీషనరేట్ పరిధిలో సుదీర్ఘకాలంపాటు విశేష సేవలందించిన ఇద్దరు పోలీసు అధికారుల పదవీ విరమణ సన్మాన కార్యక్రమం (Farewell Ceremony) శుక్రవారం జిల్లా కమీషనరేట్ కార్యాలయంలో ఘనంగా జరిగింది. కరీంనగర్ పోలీసు కమీషనరేట్ కరీంనగర్ వన్ టౌన్ పోలీసు స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ కె.కరుణాకర్, కొత్తపల్లి హెడ్ కానిస్టేబుల్ టి.జగన్ మోహన చారిలు పదవీ విరమణ పొందారు.

​కరీంనగర్ అడిషనల్ డీసీపీ వెంకటరమణ ముఖ్య అతిథిగా హాజరై, పదవీ విరమణ పొందిన అధికారులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అడిషనల్ డీసీపీ మాట్లాడుతూ.. అనేక సవాళ్లతో కూడుకున్న పోలీస్ ఉద్యోగాన్ని విజయవంతంగా, నిబద్ధతతో పూర్తి చేసి పదవీ విరమణ పొందడం ఒక గొప్ప విజయమని కొనియాడారు. అధికారులు అందించిన సేవలకు వారి కుటుంబ సభ్యుల సహకారం ఎంతో కీలకమని, ఆ సహకారం వల్లే వారు సమర్థవంతంగా పనిచేయగలిగారని గుర్తు చేశారు.

పదవీ విరమణ తర్వాత అధికారులు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు.అడిషనల్ డీసీపీ స్వయంగా పదవీ విరమణ పొందిన ఇద్దరికి పూలమాలలు వేసి, శాలువాలతో సత్కరించారు. వారికి జ్ఞాపికలను అందజేసి, వారి భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు.​ఈ కార్యక్రమంలో రిజర్వు ఇన్స్పెక్టర్ (సంక్షేమం) కిరణ్ కుమార్ , కరీంనగర్ పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్సై శ్రీ మామిడి సురేందర్ ఇతర అధికారులు, సిబ్బంది కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>