జకోవిచ్‌కు స్ట్రఫ్ షాక్.. టోర్నీ నుంచి ఔట్!

కలం, స్పోర్ట్స్​ : టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్‌ (Novak Djokovic) కు బాసెల్ టోర్నీలో షాక్ తగిలింది. రెండో రౌండ్‌లోనే అతడి ప్రయాణం ముగిసింది. జర్మనీ ఆటగాడు జాన్ లెన్నార్డ్ స్ట్రఫ్ చేతిలో ఓటమి పాలయ్యాడు. హోరాహోరీగా సాగిన పోరులో 6-7, 7-5, 7-6తో స్ట్రఫ్ విజయం సాధించాడు. దీంతో జకోవిచ్ బాసెల్ టోర్నీ నుంచి నిష్క్రమించాడు. 2 గంటల 35 నిమిషాల పాటు ఈ మ్యాచ్ సాగింది. తొలి సెట్‌లో ఇద్దరూ తమ సర్వీస్‌లను నిలబెట్టుకున్నారు. టైబ్రేక్‌లో జకోవిచ్ పైచేయి సాధించాడు.

అయితే రెండో సెట్‌లో 5-6 వద్ద తన సర్వీస్‌ను కోల్పోయాడు. దీంతో స్ట్రఫ్ మ్యాచ్‌ను సమం చేశాడు. మూడో సెట్‌లోనూ ఇద్దరి మధ్య గట్టి పోటీ జరిగింది. చివరకు టైబ్రేక్‌లో 7-5తో స్ట్రఫ్ గెలిచాడు. జకోవిచ్‌ (Novak Djokovic) పై గతంలో ఎనిమిది సార్లు ఓడిన స్ట్రఫ్‌కు ఇది తొలి విజయం. ఈ ఓటమితో జకోవిచ్ ఏటీపీ ఫైనల్స్ రేసులో కీలక పాయింట్లు కోల్పోయాడు. ప్రస్తుతం రేస్ ర్యాంకింగ్స్‌లో 11వ స్థానంలో ఉన్నాడు.

నవంబర్‌లో టూరిన్‌లో జరిగే ఏటీపీ ఫైనల్స్‌కు టాప్-8 ఆటగాళ్లు అర్హత సాధిస్తారు. మరోవైపు తొమ్మిదో స్థానంలో ఉన్న స్పెయిన్ ఆటగాడు రఫేల్ జోడార్ కూడా బాసెల్‌లో రెండో రౌండ్‌లోనే ఓడిపోయాడు. మొనాకో ఆటగాడు వాలెంటిన్ వాచెరోట్ చేతిలో పరాజయం పాలయ్యాడు. ఏడో స్థానంలో ఉన్న ఫ్రాన్స్ ఆటగాడు ఆర్థర్ ఫిల్స్ మాత్రం అమెరికా ఆటగాడు అలెక్స్ మిచెల్సన్‌ను ఓడించి ముందడుగు వేశాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>