తెలంగాణలో వైన్ టూరిజం.. 2 జిల్లాలు ఎంపిక

కలం, వెబ్ డెస్క్: మెడికల్ టూరిజంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన తెలంగాణ ప్రభుత్వం ఇక వైన్ టూరిజం అభివృద్ధి చేయాలని భావిస్తోంది. దీని కోసం అవసరమైన ప్రణాళికల రూపకల్పనకు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) అమెరికా వెళ్లారు. అక్కడ వర్జీనియాలో ఉన్న స్టోన్ టవర్ వైనరీని పరిశీలించి, నిర్వాకులతో మాట్లాడారు. ద్రాక్ష సాగు నుంచి మొదలు వైన్ తయారీ వరకు జరుగుతున్న ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు.

ఆ జిల్లాల్లో పుష్కల అవకాశాలు..

రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ద్రాక్ష తోటలు పెంచేందుకు అనువైన వాతావరణం ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఆ రెండు జిల్లాలను ప్రాథమికంగా ఎంపిక చేశామని.. అక్కడ వైన్ పరిశ్రమలు ప్రోత్సహించాలని భావిస్తున్నట్లు వివరించారు. తద్వారా రైతులకు పెద్ద ఎత్తున ఆదాయంతో పాటు వైన్ టూరిజం కూడా బాగా అభివృద్ధి చెందుతుందన్నారు. తెలంగాణ టూరిజం కాంక్లేవ్‌లో వైన్ యార్డ్ రిసార్ట్ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిందన్నారు. త్వరలోనే అధ్యయన నివేదికను రూపొందించి సీఎంకు అందిస్తామని స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>