Mobile Popup Ad
Mobile Popup Ad

కరీంనగర్ దోపిడీ కేసు.. బెంగాల్‌లో నిందితుడి అరెస్ట్!

కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ నగరంలోని పీఎంజే జువెలరీ (PMJ Jewellery)లో జరిగిన భారీ దోపిడీ కేసు (Karimnagar Robbery Case)లో పోలీసుల విచారణ వేగవంతమైంది. ఈ కేసులో తాజాగా ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. చోరీ చేసిన బంగారాన్ని విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా, పశ్చిమ బెంగాల్‌లో ఒక నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడి వద్ద నుంచి కొంత మేర బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగిలించిన నగలను కొనుగోలు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ దోపిడీలో పాల్గొన్న మరో ఐదుగురు దొంగలు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వారి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. ​పరారీలో ఉన్న మిగిలిన నిందితులను త్వరలోనే పట్టుకుని, పూర్తిస్థాయిలో రికవరీ చేస్తామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>