Mobile Popup Ad
Mobile Popup Ad

వర్షాకాల సన్నద్ధత, పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: కొలగాని శ్రీనివాస్

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) నగరపాలక సంస్థ కార్యాలయంలో శానిటేషన్ వింగ్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ పాల్గొని వర్షాకాల ముందస్తు సన్నద్ధత, పారిశుధ్య నిర్వహణ, ప్రజారోగ్య పరిరక్షణకు సంబంధించి పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. నగరంలోని ప్రధాన నాలాలు, అంతర్గత మురుగు కాలువలలో పూడికతీత పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. గతంలో వర్షాలకు నీరు నిలిచిన లోతట్టు ప్రాంతాలను గుర్తించి, అవసరమైన చోట శాశ్వత లేదా తాత్కాలిక మోటార్ పంపులను సిద్ధంగా ఉంచాలని సూచించారు. జేసీబీలు, పూడికతీత యంత్రాల లభ్యతపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలన్నారు.

నగరంలో ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను విడివిడిగా సేకరించే విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని, స్వచ్ఛ ఆటోల పనితీరు, రూట్ మ్యాపులను క్రమం తప్పకుండా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. సేకరించిన చెత్తను సకాలంలో డంపింగ్ యార్డుకు తరలించి, బయో మైనింగ్, కంపోస్టింగ్ పనులను వేగవంతం చేయాలని పేర్కొన్నారు. మార్కెట్లు, ప్రధాన కూడళ్లు, వాణిజ్య ప్రాంతాల్లో రాత్రి వేళల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పారిశుధ్య కార్మికులు, జవాన్లు, సూపర్‌వైజర్ల బయోమెట్రిక్ హాజరును కచ్చితంగా అమలు చేయాలని, వారికి గ్లోవ్స్, మాస్కులు, బూట్లు, రెయిన్‌కోట్లు వంటి రక్షణ పరికరాలను సకాలంలో అందజేయాలని అధికారులను ఆదేశించారు.

వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధుల నివారణకు యాంటీ లార్వా ఆపరేషన్లను మరింత విస్తృతంగా నిర్వహించాలని, నిల్వ నీటి ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్ వేయడం, గంబూసియా చేపలను వదలడం వంటి చర్యలను చేపట్టాలని సూచించారు. నగరంలోని అన్ని డివిజన్లలో వారానికొకసారి ఫాగింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తూ, వ్యాధి ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు.

‘మాన్‌సూన్ ఎమర్జెన్సీ టీమ్స్’ ఏర్పాటు

భారీ వర్షాలు, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వార్డు, సర్కిల్ స్థాయిలో ‘మాన్‌సూన్ ఎమర్జెన్సీ టీమ్స్’ ఏర్పాటు చేయాలని, మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో 24 గంటలు పనిచేసే ప్రత్యేక కంట్రోల్ రూమ్, హెల్ప్‌లైన్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ప్రజల్లో స్వచ్ఛతపై మరింత అవగాహన పెంచేందుకు స్వయం సహాయక బృందాలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో మైక్ అనౌన్స్‌మెంట్లు నిర్వహించాలని సూచించారు. ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం, తడి – పొడి చెత్త వేరు చేయడం వంటి అంశాలపై విస్తృత ప్రచారం చేపట్టాలని పేర్కొన్నారు. రోడ్లపై, ఖాళీ స్థలాల్లో చెత్త వేస్తున్న వ్యాపార సంస్థలు, నివాసితులపై నిబంధనల ప్రకారం జరిమానాలు విధించి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

అదేవిధంగా శానిటేషన్ విభాగం ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఐదు డివిజన్లలో ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి డివిజన్‌లో పారిశుధ్య పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. నగరాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా ఉంచేందుకు ప్రతి అధికారి, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని మేయర్ కొలగాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మున్సిపల్ అధికారులు, శానిటేషన్ వింగ్ సిబ్బంది, సూపర్‌వైజర్లు తదితరులు పాల్గొన్నారు.

Read Also: ఇంటర్‌లో పాసైన మాజీ మావోయిస్ట్ అగ్రనేత దేవ్‌జీ.. మార్కులు ఎన్నంటే?

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>