Mobile Popup Ad
Mobile Popup Ad

ఇంటర్‌లో పాసైన మాజీ మావోయిస్ట్ అగ్రనేత దేవ్‌జీ.. మార్కులు ఎన్నంటే?

కలం, వెబ్ డెస్క్ : ఆయుధాల మార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చిన మాజీ మావోయిస్ట్ అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ (Devji) చదువు బాట పట్టిన సంగతి తెలిసిందే. ఇటీవల రాసిన లాసెట్ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో ఏకంగా 349వ ర్యాంక్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచిన ఆయన.. గురువారం విడుదలైన తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాల్లోనూ సత్తా చాటారు.

జనజీవన స్రవతిలోకి వచ్చిన తర్వాత చదువుకోవాలనే తన బలమైన సంకల్పంతో దేవ్ జీ గతంలో మధ్యలో ఆపేసిన ఇంటర్ సెకండియర్ తెలుగు పరీక్షను ఇటీవల ఉన్నతాధికారుల ప్రత్యేక అనుమతితో రాశారు. ఈ క్రమంలోనే ఇవాళ విడుదలైన ఫలితాల్లో తెలుగు పరీక్షలో దేవ్ జీ 72 మార్కులతో పాసయ్యారు. తద్వారా ఇంటర్‌లో మొత్తం 614 మార్కులు సాధించారు. ఇంటర్ లో పాస్ కావడంతో దేవ్ జీ లా డిగ్రీ చదివేందుకు లైన్ క్లియర్ అయింది. కాగా, గన్ వదిలి పెన్ను పట్టిన దేవ్ జీ వరుస విజయాలు సాధించడంపై విద్యాశాఖ, పోలీస్ ఉన్నతాధికారులు, ఆయన సన్నిహితులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>