రేకుర్తి అభివృద్ధికి రూ. 3 కోట్లు.. మేయర్ శ్రీనివాస్ కీలక ప్రకటన!

కలం, కరీంనగర్: నగరపాలక సంస్థ అభివృద్ధిని నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తున్నట్లు నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ (Kolagani Srinivas) అన్నారు. కరీంనగర్ (Karimnagar) నగరపాలక సంస్థ అభివృద్ధిలో భాగంగా శుక్రవారం 20వ డివిజన్ రేకుర్తిలో ఆయన పర్యటించారు. ధర్మపురి కాలనీలో డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్‌రావు, స్థానిక కార్పోరేటర్ పర్వతం మల్లేషంతో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. నగరపాలక సంస్థకు చెందిన రూ.31.20 లక్షల నిధులతో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణం పనులకు భూమీ పూజ చేసి ప్రారంభించారు.

అభివృద్ధి పనులను నాణ్యతతో పూర్తి చేయాలి..

అనంతరం డివిజన్ కార్పోరేటర్, స్థానిక మహిళలు దృష్టికి తెచ్చిన సమస్యలపై కాలనీల్లో పాదయాత్ర చేసి డ్రైనేజీ, కల్వర్టు సమస్యలను తనిఖీ చేసి పరిశీలించారు. సమస్యల పరిష్కారం కోసం ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను సూచించారు. డివిజన్‌లో చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు.

ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ..నగరపాలక సంస్థలో విలీనం చెందిన శివారు ప్రాంత డివిజన్ కావడంతో చాలా సమస్యలు ఉన్నాయని.. సంబంధిత రోడ్లు, డ్రైనేజీ, కల్వర్టు, త్రాగునీరు, పారిశుధ్యం, తదితర సమస్యలన్నీటిని ప్రాధాన్యత క్రమంలో దశలవారీగా పరిష్కరిస్తామని తెలిపారు.

రేకుర్తి అభివృద్ధికి రూ. 3 కోట్లు కేటాయించాం..

రేకుర్తి డివిజన్‌లో సమస్యల పరిష్కారం కోసం వివిధ గ్రాంట్ల కింద దాదాపు రూ.3 కోట్ల నిధులు కేటాయించామని స్పష్టం చేశారు. నగరపాలక సంస్థ సాధారణ నిధులు, యూఐడీఎఫ్ నిధులతో ఇప్పటికే పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు ప్రారంభం చేశామన్నారు. యూఐడీఎఫ్ నుంచి ప్రస్తుతం రూ.70 లక్షలతో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. శివారు ప్రాంతంగా ఉన్న రేకుర్తి డివిజన్‌తో పాటు ఇతర శివారు ప్రాంత డివిజన్లను కూడ అభివృద్ధి బాట పట్టిస్తున్నట్లు తెలిపారు.

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సూచనల మేరకు నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ.. పాలకవర్గ సభ్యుల ద్వారా నేరుగా డివిజన్లలో సమస్యలను తెలుసుకొని ప్రజలకు కావాల్సిన వసతులు, సౌకర్యాలను కల్పించేందుకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపడుతున్నట్ల చెప్పారు. తమ పాలకవర్గం నగర అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తుందని స్పష్టం చేశారు. నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు పేర్కొన్నారు.

రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని నగరవాసులు త్రాగు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని మేయర్ కోరారు. అలాగే రానున్న దీపావళి పండుగ సందర్బంగా.. సమాధుల పండుగ జరుపుకునేందుకు నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న శ్మశానవాటికల్లో చదును కార్యక్రమాలు, త్రాగునీరు, విద్యుత్ దీపాలు, నిరంతర పారిశుద్ధ్య వసతులు కల్పించేందుకు నగరపాలక సంస్థ ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ నగర సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఇంజనీరింగ్ అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>