ఐమాక్స్ లైట్లను ప్రారంభించిన కరీంనగర్ మేయర్

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) నగరపాలక సంస్థ పరిధిలోని 45వ డివిజన్‌లో ఏర్పాటు చేసిన ఆధునిక ఐమాక్స్ లైట్లను నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన వీధి లైట్ల ద్వారా వెలుతురు అందించడం ద్వారా రాత్రి వేళల్లో ప్రయాణికులు, స్థానికులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించడమే లక్ష్యమన్నారు. నగర అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు పాలకవర్గం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. అనంతరం స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు మేయర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్ గుగ్గిళ్ల జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>