జర్నలిస్టుల హక్కుల కోసం గాంధీ విగ్రహం వద్ద నిరసన

కలం, కరీంనగర్: జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ) కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు అధ్యక్ష కార్యదర్శులు గాండ్ల శ్రీనివాస్, కొయ్యడ చంద్ర శేఖర్ లు డిమాండ్ చేశారు. ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) పిలుపు మేరకు గాంధీ జయంతి సందర్భంగా కరీంనగర్ కలెక్టరేట్ ఆవరణంలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద జర్నలిస్టులు (Karimnagar Journalists) నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో పాలనాధికారి చిత్ర మిశ్ర కు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు.

ఈ సందర్భంగా గాండ్ల శ్రీనివాస్, కొయ్యడ చంద్రశేఖర్ లు మాట్లాడుతూ.. బెంగళూరులో జరిగిన ఐజేయూ కార్యవర్గ సమావేశంలో దేశవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని సమావేశం ఆందోళన వ్యక్తం చేసిందన్నారు. మీడియా రంగానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి నూతన మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

మీడియా సిబ్బందికి రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని, రద్దు చేసిన చట్టాల స్థానంలో జర్నలిస్టుల చట్టబద్ధమైన హక్కులను పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు. జర్నలిస్టుల వేతనాలు, ఉద్యోగ భద్రత కోసం నూతన వేజ్ బోర్డు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు చేయాలన్నారు.

పత్రికా స్వేచ్ఛను పరిరక్షించడంతో పాటు మీడియా కార్మికుల సామాజిక, ఆర్థిక భద్రతకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని టీయూడబ్ల్యూజే నాయకులు కోరారు. నిలిపివేసిన రైల్వే పసులు పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న నిర్మాణాత్మక, చట్టపరమైన సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన జర్నలిస్టులకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు కేటాయించాలన్నారు.  ప్రభుత్వ ఉద్యోగులకు అందిస్తున్న తరహాలో హెల్త్ కార్డులు మంజూరు చేసి క్యాష్‌లెస్ వైద్య చికిత్స అందించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎలగందుల రవీందర్, జిల్లా ఉపాధ్యక్షులు గాండ్ల సంపత్, ఎండి షుకూర్,సంయుక్త కార్యదర్శి దాడి సంపత్ కోశాధికారి గాజుల వెంకటేష్, ఎలక్ట్రానిక్ మీడియా కార్యదర్శి యూ.రవీందర్, సీనియర్ నాయకులు కే విజయందర్ రెడ్డి, అనుబంధ కమిటీల రాష్ట్ర నాయకులు ఈద మధుకర్, ఎన్ మహీంద్రా చారి, జిల్లా కార్యవర్గ సభ్యులు జన్నారం శ్రీనివాస్, కే గంగరాజు, ఎలిగేటి శ్రీనివాస్, కే వేణు గోపాల్, బుర్ర తిరుపతి, కంకణాల రఘు, రేగుల నర్సింగం, సిరిసిల్ల అనిల్ కుమార్, బుర్ర పరుశురాం గౌడ్, బీ సదానందం, అసద్, వి సదానందం, శంకరపట్నం మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు జక్కోజు రమేష్, జిల్లా అనుబంధ కమిటీల నాయకులు జక్కుల సుమ, సతీష్ లతో పాటు ప్రింట్ అండ్ ఎలక్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>