​సీఎం రేవంత్ రెడ్డికి ఉద్యోగ జేఏసీ ఘన స్వాగతం

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ జిల్లాకు నూతన పరిపాలనా కేంద్రంగా రూపుదిద్దుకున్న ఇంటిగ్రేటెడ్ జిల్లా కార్యాలయ సముదాయం (IDOC) ప్రారంభోత్సవానికి విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డికి జిల్లా ఉద్యోగ జేఏసీ (Karimnagar Employee JAC) ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. ​రాష్ట్ర ఉద్యోగ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, కరీంనగర్ జిల్లా ఉద్యోగ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి, కన్వీనర్ మడిపల్లి కాళీ చరణ్ గౌడ్ నేతృత్వంలో జిల్లా ఉద్యోగులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

పరిపాలనా చరిత్రలో కీలక ఘట్టం

ఈ సందర్భంగా ఉద్యోగ జేఏసీ నాయకులు మాట్లాడుతూ..  జిల్లా ప్రజలకు ఆధునిక పరిపాలనా సౌకర్యాలను ఒకే ప్రాంగణంలో అందుబాటులోకి తీసుకువచ్చేలా నిర్మించిన IDOC ప్రారంభోత్సవం జిల్లా పరిపాలనా చరిత్రలోనే ఒక ముఖ్యమైన ఘట్టమని పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల సేవలు ఒకే చోట లభించడం వల్ల ప్రజలకు సేవలు మరింత సులభంగా, వేగవంతంగా, సమర్థవంతంగా అందుతాయని హర్షం వ్యక్తం చేశారు.

​జిల్లా కలెక్టర్‌కు ధన్యవాదాలు

అనంతరం జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాను ఉద్యోగ జేఏసీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టరేట్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అత్యంత విజయవంతంగా నిర్వహించినందుకు కలెక్టర్‌కు పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

​భారీగా పాల్గొన్న ఉద్యోగ సంఘాల నేతలు

ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు లక్ష్మణరావు, అరవింద్ రెడ్డి, ముప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి, రాగి శ్రీనివాస్, సర్దార్ హర్విందర్ సింగ్, ప్రభాకర్ రెడ్డి, గంగారపు రమేష్, ప్రసాద్ రెడ్డి, శారద, సరిత, కరుణ, సూర్య, వీణ, రామచంద్ర రెడ్డి, బాస పవన్, పోల్ కిషన్, సుమంత్ రావు, వాస్తవిక గౌడ్, శ్రీమాన్, శంశోద్దిన్, లవకుమార్, కర్ణాకర్, అజ్గర్ అలీ, నారాయణ, రాజమల్లు తదితర నాయకులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘జై తెలంగాణ’, ‘జై ఉద్యోగుల ఐక్యత’ అనే నినాదాలతో ప్రాంగణం మారుమోగింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>