కలం, కరీంనగర్ బ్యూరో: ఓటు హక్కు పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా దేశ రాజధాని ఢిల్లీలో రామ్‌లీలా మైదానంలో ఇండియా కూటమి ర్యాలీలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ (Karimnagar Congress) ప్రజాప్రతినిధులు గళమెత్తారు. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, గడ్డం వినోద్ వెంకటస్వామితో పాటు ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించేందుకు చేపట్టిన ఈ నిరసన కార్యక్రమంలో నేతలు ఐక్యంగా పాల్గొని కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. దేశంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పారదర్శకంగా జరగడం లేదని ఆరోపించారు. ప్రజాస్వామ్య పునాదులను కాపాడుకోవడానికి ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు.

