Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రైవేట్ ఆసుపత్రుల రిజిస్ట్రేషన్ వేగవంతం: కరీంనగర్ కలెక్టర్

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాత్రి కలెక్టరేట్‌లో జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ యాక్ట్-2010 అమలు, ప్రైవేట్ ఆసుపత్రుల రిజిస్ట్రేషన్లు, అనుమతుల జారీ ప్రక్రియపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ప్రైవేట్ ఆసుపత్రుల రిజిస్ట్రేషన్ సందర్భంగా ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ.. దరఖాస్తు చేసుకున్న ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు, భద్రతా ప్రమాణాలు, అగ్నిమాపక శాఖ, కాలుష్య నియంత్రణ మండలి తదితర శాఖల అనుమతులను పరిశీలించారు. అనంతరమే నిరభ్యంతర ధ్రువీకరణ పత్రాలు (ఎన్‌ఓసీలు) జారీ చేయాలని ఆదేశించారు.

3 నెలల్లోగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి..

రిజిస్ట్రేషన్ దరఖాస్తుల పరిశీలన మూడు నెలల్లోగా పరిశీలించి, రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు ఎదుర్కొనే సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్‌ను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ యాక్ట్-2010 ప్రకారం అన్ని వైద్య సంస్థలు రిజిస్ట్రేషన్ పొందడం ద్వారా వైద్య సేవల నాణ్యత, పారదర్శకత మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. శ్రీరామ్, జిల్లా ఫైర్ ఆఫీసర్ ముప్పిడి శ్రీనివాస్ రెడ్డి, పోలీసు శాఖ ప్రతినిధులు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) జిల్లా అధ్యక్షురాలు ఆకుల శైలజ, ప్రధాన కార్యదర్శి మహేష్ కోశాధికారి నీలిమ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>