కలం, కరీంనగర్ బ్యూరో: నీట్ లీకేజీకి బాధ్యుడైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, ఎన్‌టీఏ రద్దు, ఢిల్లీలో విద్యార్థులపై పోలీసు దాడిని ఖండిస్తూ ఈ నెల 24 విద్యాసంస్థల బంద్‌కు వామపక్షాలు పిలుపునిచ్చాయి. దీనికి మద్దతు ఇవ్వాలని కరీంనగర్ (Karimnagar) జిల్లా ఏఐవైఎఫ్, డీవైఎఫ్ఐ శాఖలు పిలుపునిచ్చాయి.
తిరుగుబాటు తప్పదు..
గురువారం బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో జరిగిన సమావేశంలో ఏఐవైఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కసిబోసుల సంతోష చారి, కార్యదర్శి బ్రాహ్మణపల్లి యుగంధర్, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నరేష్ పటేల్ పాల్గొని మాట్లాడారు. విద్యావ్యవస్థ సంక్షోభంపై విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు చేపట్టిన శాంతియుత నిరసనను అణిచివేయడం దుర్మార్గమన్నారు. మోదీ ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే.. యువత తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. పెనుమల్ల ఉదయ భాస్కర్, శివ కుమార్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

