Mobile Popup Ad
Mobile Popup Ad

సంచలనం.. తమిళనాడులో డీఎంకే – అన్నాడీఎంకే ప్రభుత్వం ?

కలం, వెబ్ డెస్క్ : తమిళనాడులో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. 118 మంది సభ్యుల బలం ఉంటేనే టీవీకే ప్రభుత్వ ఏర్పాటు కు క్లియెరెన్స్ ఇస్తానని తమిళనాడు గవర్నర్ అంటున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడు గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ తీరుపై ఎంపీ కపిల్ సిబాల్ (Kapil Sibal )ఆగ్రహం వేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. డీఎంకే, అన్నాడీఎంకే సర్కార్ ఏర్పాటు కావాలని గవర్నర్ కోరుకుంటున్నారని ఆరోపించారు. అందుకే విజయ్ కు అవకాశం ఇవ్వడం లేదని చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వ ఏర్పాటును కావాలనే ఆలస్యం చేస్తున్నారని మండిపడ్డారు. అయితే మెజారిటీ లేకున్నా అతిపెద్ద పార్టీకి అవకాశం ఇవ్వాలన్న కపిల్ సిబాల్.. కర్నాటకలో గతంలో బీజేపీకి ఇలాగే అవకాశం దక్కిందని గుర్తు చేశారు. గవర్నర్ ఆ సాంప్రదాయాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.

మరోవైపు గవర్నర్ తీరుపై విజయ్ ఫ్యాన్స్ కూడా ఫైర్ అవుతున్నారు. విజయ్ ను సీఎం కాకుండా కుట్ర చేస్తున్నారని ఆగ్రహిస్తున్నారు. గవర్నర్ తీరు మార్చుకోకపోతే.. జల్లికట్టు తరహాలో ఉద్యమం చేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. అటు సోషల్ మీడియాలోనూ విజయ్ కు నెటిజన్ల నుంచి మద్దతు పెరుగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు సింగిల్ లార్జెస్ట్ పార్టీని ఆహ్వానించాలని గవర్నర్ ను కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>