చిరాగ్ పాశ్వాన్‌తో కంగనా రనౌత్ డేటింగ్.. అసలు మ్యాటర్ ఇదే

కలం, వెబ్ డెస్క్: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut) కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌తో డేటింగ్ (Dating) చేస్తున్నారనే వార్తలపై స్పందించారు. వీరిద్దరూ తరచుగా పార్లమెంట్‌ ప్రాంగణంలో నవ్వుతూ మాట్లాడుకుంటూ కనిపించడంతో సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు షికారు చేశాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై కంగనా క్లారిటీ ఇచ్చారు. ‘చిరాగ్ (Chirag Paswan) నాకు చాలా కాలంగా తెలుసు, ఆయన నాకు కేవలం మంచి స్నేహితుడు మాత్రమే. మా మధ్య ఎలాంటి ప్రేమాయణం లేదు. ఆయన కూడా చిత్ర పరిశ్రమ నేపథ్యం నుండి వచ్చిన వ్యక్తి కాబట్టి, సౌకర్యంగా అనిపిస్తుంది’ అని పేర్కొన్నారు.

అంతేకాకుండా ఈ రూమర్లపై కంగనా (Kangana Ranaut) తనదైన శైలిలో చమత్కరిస్తూ.. ‘మా మధ్య నిజంగానే ఏదైనా ప్రేమ ఉండి ఉంటే, అది ఎప్పుడో పదేళ్ల క్రితమే మొదలయ్యేది. మేమిద్దరం 2011లో ‘మిలే నా మిలే హమ్’ సినిమాలో కలిసి నటించాం. ఒకవేళ అప్పుడే మా మధ్య రొమాన్స్ ఉండి ఉంటే, ఈ పాటికి పిల్లలు కూడా ఉండేవారు’ అని సరదాగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తామిద్దరం రాజకీయాల్లో బిజీగా ఉన్నామన్నారు. తమ మధ్య ఉన్నది కేవలం గౌరవప్రదమైన స్నేహం మాత్రమేనని స్పష్టం చేశారు.

Read Also: ఉప్పల్ వేదికగా ధోని మేనియా.. పసుపు వర్ణంగా మారనున్న స్టేడియం!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>