కలం, నిజామాబాద్ బ్యూరో: పదో తరగతి వార్షిక పరీక్షల జవాబు పత్రాల వాల్యూయేషన్ ప్రక్రియకు కామారెడ్డి (Kamareddy) జిల్లా ఎంపికైంది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారికి విద్యా శాఖ డైరెక్టర్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. క్యాంప్ ఏర్పాటు చేసే సెంటర్, వాల్యూయేషన్‌కు టీచర్ల సర్దుబాటు, ఇతర వసతులు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. హైదారాబాద్, వరంగల్ ఆర్‌జేడీలకు కూడా ఈ మేరకు సమాచారం అందించారు. వాల్యూయేషన్ కేంద్రం (Valuation Center) ఏర్పాటుతో తాత్కాలికంగా ఉపాధ్యాయులు, సిబ్బంది, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, భద్రతా సిబ్బందికి పని దొరుకుతుంది. ఆ ప్రాంతానికి విద్యా పరంగా మంచి గుర్తింపు వస్తుంది. ప్రభుత్వ స్థాయిలో ప్రాధాన్యం కూడా పెరుగుతుంది.
Read Also: ఐటీఐలో ఆన్-ది-జాబ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్
Follow Us On: Instagram

