కలం, వెబ్ డెస్క్ : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ కమల్ హాసన్ (Kamal Haasan) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఏ ఒక్క పార్టీకి స్వతంత్రంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజారిటీ ఇవ్వలేదని, ఇది తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక ప్రత్యేక పరిణామమని ఆయన పేర్కొన్నారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నామన్న స్టాలిన్ (Stalin) రాజకీయ పరిపక్వతను ప్రశంసించారు. అలాగే విజయ్ (Vijay) నేతృత్వంలోని టీవీకే పార్టీ 108 సీట్లు గెలుచుకున్న నేపథ్యంలో, వారికి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వకపోవడం ప్రజల తీర్పును అవమానించడం అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
అసెంబ్లీ సభ్యులు ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేని పరిస్థితిని కమలహాసన్ ‘ప్రజాస్వామ్యానికి నష్టం’ గా పేర్కొన్నారు. అలాగే సుప్రీంకోర్టు ఎస్.ఆర్. బొమ్మై కేసు తీర్పును ప్రస్తావిస్తూ.. మెజారిటీని అసెంబ్లీలోనే నిర్ధారించాలని రాజ్ భవన్‌లో కాదని గుర్తుచేశారు. తాను చెప్పేది పార్టీ రాజకీయాలు కాదని, ఇది ఒక భారతీయ పౌరుడి అభిప్రాయమని కమల్ హాసన్ స్పష్టం చేశారు. తమిళనాడు ప్రజల తీర్పును గౌరవించాల్సిన అవసరం ఉందని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.

